పార్ట్ – 1 లో చెప్పినట్టుగా ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ గురించి, ఎడిటింగ్ లోని రకాల గురించి తెలుసుకుందాం. సినిమా కానీ, ఇండిపెండెంట్ ఫిలిం కానీ, షార్ట్ ఫిలిం కానీ, సీరియల్స్, న్యూస్ ఎడిటింగ్ లాంటి పనులన్నింటికీ ముఖ్యంగా ౩ ప్రొఫెషనల్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ అందుబాటులో ఉన్నాయి. అవే ఫైనల్ కట్ ప్రో, ఆవిడ్ మీడియా కంపోజర్, అడోబ్ ప్రీమియర్ ప్రో. ఎన్నో రకాల ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ మొబైల్స్ లో, ఇంట్లో ఉండే సిస్టం లో ఎడిట్ చేసుకునే వీలున్నా కూడా ఈ ౩ సాఫ్ట్వేర్స్ వాడటం ఉత్తమం. ఈ సాఫ్ట్వేర్ల ఎంపిక చేసుకొని పని చేయడం ప్రారంభించిన వెంటనే మీకు అర్థం అవుతుంది. వీటిలో ఎడిటింగ్ కు దొరికే సౌలభ్యం ఏంటో. ఎడిటింగ్ లో ముఖ్యమైన ఫ్రేమ్ రేట్, ఫ్రేమ్ సైజు అన్ని మనకు కెమెరా లో షూట్ చేసుకునే వాల్యూస్ తోనే సీక్వెన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. ఎన్ని రకాలు ఎడిటింగ్ లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
ముఖ్యంగా ఎడిటింగ్ రెండు రకాలుగా విభజించ బడింది. ఒకటి లినియర్ ఎడిటింగ్ రెండు నాన్ లినియర్ ఎడిటింగ్.
లినియర్ ఎడిటింగ్ : ముందే ఫిక్స్ చేసిన ఆర్డర్ లో ఇచ్చిన సౌండ్ కి తగ్గట్టుగా మనవద్ద ఉన్న వీడియో క్లిప్స్, ఫొటోస్ ని క్రమం లో అమర్చుకొని వీడియో తాయారు చేయడమే లినియర్ ఎడిటింగ్.
ఆ వీడియో క్లిప్స్ కామకార్డర్ లో తీసి ఉండొచ్చు, టేప్ లో రికార్డు చేసి ఉండొచ్చు చిప్స్ లో రికార్డు చేసి ఉండొచ్చు. ఇక్కడ మనం మనకు ఇచ్చిన సీక్వెన్స్ కి తగట్టుగా వీడియో అవుట్ పుట్ ఇస్తున్నామా అన్నదే మనం కచ్చితంగా చూసుకోవాల్సిన విషయం.
నాన్-లినియర్ ఎడిటింగ్ : ఈ ఎడిటింగ్ లో నిర్ణయించబడిన ఆడియో లో కానీ వీడియో లో కానీ మార్పులు చేర్పులకు ఆస్కారం ఉంది. ఎందుకు అంటే నిర్మాణాంతర పనులలో భాగంగా స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ముందు సీన్స్ వెనకకి, వెనక సీన్స్ ముందుకి మార్చాల్సి ఉంటుంది. సినిమా కానీ సీరియల్ కానీ డబ్బింగ్ తర్వాత అలాగే కొన్ని విసువల్ ఎఫెక్ట్స్ అనంతరం ఎక్కువగా మార్పులకి అవకాశం ఉంది. అంతే కాదు సాంగ్ ఎడిటింగ్ లో కూడా కొన్ని సందర్భాలలో రఫ్ ట్యూన్ కి మిక్స్ ఎడిట్ చేసిన క్లిప్స్ ఫైనల్ క్లిప్ కోసం సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ రకమైన ఎడిటింగ్ కి ఎడిట్ లిస్ట్ కూడా ఉంటుంది. ఓకే ఐన షాట్స్ మొత్తం లిస్ట్ గా ప్రిపేర్ చేసి ఆ షాట్ కి సంబంధించిన వివరాలు కూడా అందులో ఉంచుతారు.అవసరాన్ని బట్టి క్లిప్స్ సెలెక్ట్ చేసుకొని ఎడిటింగ్ సులభతరం చేసుకునేందుకు ఈ ఎడిట్ లిస్ట్ బాగా ఉపయోగపడుతుంది.
ఎడిటింగ్ లోని ట్రాన్సిషన్స్ & ఎఫెక్ట్స్ గురించి తరువాత భాగం లో తెలుసుకుందాం.
Blog by Multimedia Faculty – Harshavardhan Reddy.