ఎడిటర్ కష్టాలు పార్ట్ – 1 మిస్ అయినా వాళ్ళు ఇదే సైట్ లో చదవొచ్చు.

ఎడిటర్ కష్టాలు పార్ట్ – 2 మిస్ అయినా వాళ్ళు ఇదే సైట్ లో చదవొచ్చు.

పార్ట్ – 2  లో చెప్పినట్టుగా ఎడిటింగ్ లోని ఎఫెక్ట్స్ & ట్రాన్సిషన్స్ గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఎఫెక్ట్స్:

సాధారణంగా చాలామంది ఎడిటింగ్ లో ఎఫెక్ట్స్ అంటే ఒక క్లిప్ నుంచి వేరే క్లిప్ లకి ఏదైనా షేప్ లో మారుతూ వెళ్లడం అని అనుకుంటారు కానీ నిజానికి అది కరెక్ట్ కాదు.ఎడిటింగ్ లో ఎఫెక్ట్ అనేది క్లిప్ మొత్తానికి అప్లై అవుతుంది. ఉదాహరణకి ఒక క్లిప్ కి మనం ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లోని ప్లగిన్స్ వాడి  బ్లాక్ & వైట్  చేస్తాం. సో కట్ చేసి ఉన్న క్లిప్ మొత్తం ఆ బ్లాక్ అండ్ వైట్ అప్లై అవుతుంది. ఒక్క బ్లాక్ అండ్ వైట్ ఈ కాదు అలంటి చాలా  రకాల టోన్స్, మాస్కింగ్స్, బాడ్ టీవీ ఎఫెక్ట్స్ వంటివి కూడా ఉంటాయి. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్లిప్ మొత్తం అప్లై అయ్యేది  ఎఫెక్ట్ మాత్రమే. ఎలాంటి సందర్భలలోనైనా మనం అప్లై చేసే ఎఫెక్ట్స్ సినిమా లో ఉండాలనుకునే మూడ్ ని క్యారీ చేయడం కోసం ఒకేరకమైన టోన్స్ వాడతాం. అంతే కాదు ఇదే ఎఫెక్ట్స్ లోకి స్లో మోషన్, క్లిప్ ని ఫాస్ట్ గా మూవ్ చేయడం కోసం కూడా వాడతాం. ఇలా ఫాస్ట్  ఫార్వర్డ్ లో ప్లే  చేయడాన్ని కొంతమంది ఎడిటింగ్ పరిభాష లో  రాంప్ అని కూడా అంటారు. అవసరానికి తగ్గట్టుగా మనం క్లిప్స్ కి ఈ ఎఫెక్ట్స్ ని అప్లై చేసుకుంటూ ప్రేక్షకుడికి అర్థం అవ్వాల్సిన విషయాలని క్లియర్ గా  తెలియజేయడం లో ఈ ఎఫెక్ట్స్ బాగా ఉపయోగపడతాయి.

ట్రాన్సిషన్స్ : ఒక క్లిప్ నుంచి ఇంకో క్లిప్ కి దారిని ఏర్పాటు చేయడమే ఈ ట్రాన్సిషన్స్ పని. ఈ ట్రాన్సిషన్ క్లిప్ కి క్లిప్ మధ్యలో వాడుకోవచ్చు, క్లిప్ స్టార్టింగ్ లో వాడుకోవచ్చు, లేదా క్లిప్ ఎండింగ్ లో వాడుకోవచ్చు. ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకునపుడే   కొన్ని డిఫాల్ట్  ట్రాన్సిషన్స్ వచ్చేస్తాయి. మనం అడిషనల్ గా ఇంకా కావలి అనుకుంటే ప్రత్యేకమైన  ప్యాక్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇలాంటి ట్రాన్సిషన్స్ ఎక్కువగా మనం ఇంతకముందు పెళ్లి వీడియో క్యాసెట్ట్ లలో చూసేవాళ్ళం. ఎందుకు అంటే సినిమాలలో, సీరియల్స్ లలో ఈ ట్రాన్సిషన్స్ వేయడానికి పెద్దగా అవకాశం ఉండదు, అవసరము ఉండదు. ఉదాహరణకి క్రాస్ డిసోల్వే, ఫేడ్ అవుట్, డిప్ టు బ్లాక్ లాంటి ఎన్నో రకాల ట్రాన్సిషన్స్ మనం గమనించొచ్చు.

క్రోమా కీయర్,  ఎడిటింగ్ రఫ్ కట్,  డైలాగ్ కట్  గురించి తరువాత పార్ట్ లో తెలుసుకుందాం.

Blog by Multimedia Faculty – Harshavardhan Reddy.