ఎడిటర్ కష్టాలు పార్ట్ – 4  లో చెప్పినట్టుగా  ఎడిటింగ్ లో టైటిల్స్  గురించి  ఈ రోజు తెలుసుకుందాం.

టైటిల్స్ :

సినిమాలో కానీ, షార్ట్ ఫిలిం లో కానీ టైటిల్స్ కంపల్సరీగా ఉంటాయి. ఈ టైటిల్స్ సినిమా పేరు దగ్గర మొదలు పెడితే పని చేసిన ప్రతి టెక్నీషియన్ పేరు ఉండడం సినిమాకి సినిమాకు పని చేసిన వ్యక్తులకు ప్లస్. పని చేసిన టెక్నీషియన్ ఈ వర్క్ ని చూపించి మరిన్ని ప్రాజెక్ట్స్ చేయడానికి డెమో లా ఉపయోగపడతాయి. కొత్త టెక్నీషియన్స్ ఇలా వర్క్ చేసిన టీం కి క్రెడిట్స్ ఇచ్చే టీం తో పని చేయడానికి ఇష్టపడతారు.

సాధారణంగా టైటిల్స్  ఎడిటింగ్ లోనే ఆడ్ చేస్తారు కానీ,  టైటిల్స్ క్రియేట్ చేయడం మాత్రం VISUAL EFFECTS SOFTWARES లో చేసే అవకాశం ఉంది. ఉదాహరణకి AFTER EFFECTS,  3DS MAX  ,   MAYA  , లాంటి SOFTWARES  లో చేయొచ్చు. మన సబ్జెక్టు థీమ్ ను బేస్ చేసుకొని కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకుంటారు. VFX ఆర్టిస్ట్ ఒక్కడే   కాదు EDITOR కూడా ఈ టైటిల్స్ లో భాగం కావాల్సి ఉంటుంది.  డైరెక్టర్ ఛాయస్ మేరకు 2D లో చేయాలా 3D లో చేయాలా డిసైడ్ చేస్తారు.

టైటిల్స్ లోని  రకాలు:

మెయిన్ టైటిల్ , క్రెడిట్స్, లోవర్ థార్డ్స్,  బిల్డ్ ఇన్/అవుట్  ఇలా రక రకాలుగా ఉంటాయి.

మెయిన్ టైటిల్  :

మెయిన్ టైటిల్ అంటే సినిమా పేరు ఎలా  ఉండాలి, ఎలా అనిమేట్ అవ్వాలి అని డిసైడ్ అయి వర్క్ జరిగిన తర్వాత మనం థియేటర్ లో చూస్తాం మెయిన్ టైటిల్ తెర మీద ఎలా వచ్చింది అనేది.

క్రెడిట్స్ :

ఇవి  టెక్నిషన్స్ పేర్లు .  కొంచెం  సింపుల్ గానే  ఉండేలా ప్లాన్ చేసుకుంటాం అందుకే మెయిన్ టైటిల్ కి ఉన్న హంగామా ఈ క్రెడిట్స్ కి ఉండదు.

లోవర్ థార్డ్స్ :

ఏదైనా  ఇంటర్వ్యూ కి  వచ్చిన గెస్ట్ పేరు ఆయన మాట్లాడుతున్నపుడు వచ్చేలా చేయడానికి మనకు విజూవల్ మానిటర్ సైజు ని 4 భాగాలూ గ డివైడ్ చేసి అందులో లెఫ్ట్ సైడ్ డౌన్ కార్నర్ లో ఉండేలా చూసుకుంటాం.

బిల్డ్ ఇన్/అవుట్ :

టైటిల్స్ ని స్క్రీన్ వెనక లేదా పక్కనుంచి ఆడియన్స్ కి కనిపించేలా స్క్రీన్  మీదకు  వచ్చేలా అనిమేట్ ఇన్  లేదా అనిమేట్ అవుట్ చేసుకుంటాం.

తరువాత పార్ట్ లో  తెలుగు సినిమాలకు పని చేసే ఎడిటర్ కి తెలుగు టైపింగ్ ఎంత అవసరమో  చూద్దాం.

Blog by Multimedia Faculty – Harshavardhan Reddy.