ఎడిటర్ కష్టాలు పార్ట్ – 5 లో చెప్పినట్టుగా  తెలుగు సినిమాలకు పని చేసే ఎడిటర్ కి తెలుగు టైపింగ్ ఎంత అవసరమో  చూద్దాం.

తెలుగు సినిమాలకు తెలుగు బాగా తెలిసిన వాళ్ళు, తెలుగు బాగా చదవడం, రాయడం వచ్చినవాళ్లు ఎడిటర్ గా పని చేయడం చాల మంచిది. ఇంకా చెప్పాలి అంటే అవసరం కూడా. ఎందుకు అంటే ఏ సినిమా, షార్ట్ ఫిలిం అయినా ఫైనల్ గా అన్ని చెక్ చేసి ఔట్పుట్ ఇచ్చేది ఎడిటర్. ఏ సమయం లోనయిన ఏదైనా టైటిల్స్ లో స్పెల్లింగ్ తప్పుగా ఉంటె గుర్తించే అవకాశం ఉంది.  అప్పుడు కూడా కొంచెం సమయం తీసుకొని తప్పుల్ని సరిదిద్దే వెసలుబాటు ఉంది.

ఒకవేళ VFX లో టైటిల్స్ చేసేవాళ్ళకి తెలుగు రాకపోయినా టైటిల్స్  SPELLING MISTAKES ఉంటాయి. ఒక ఎడిటర్ కి తెలుగు టైపింగ్ రావడం ఒక అదనపు అడ్వాంటేజ్ కూడా.

ఒకవేళ ఒక సినిమా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్  కారణంగా  కూడా ప్రేక్షకుల దృష్టిలో లోకువ అవుతుంది. ఆ తప్పు గుర్తించిన ప్రేక్షకులు సినిమా కోసం అంత కష్టపడి చేసారు కానీ  స్పెల్లింగ్స్ చూసుకోలేదు అనే విమర్శలు కూడా గుప్పిస్తారు. ప్రతి టైటిల్ ని, లేదా టెక్స్ట్ వాడిన ప్రతి చోట ఎడిటర్ ఫైనల్ అవుట్ ఇచ్చేముందు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం.

పరభాషా ఎడిటర్ కనుక తెలుగు సినిమా ఎడిటింగ్ చేస్తుంటే. తెలుగు బాగా తెలిసిన డైరెక్షన్ డిపార్మెంట్ స్టాఫ్  లేదా భాద్యత తీసుకునే వ్యక్తులు చూసుకుంటే మంచిది.

తరువాత పార్ట్ లో డబ్బింగ్ అనంతరం జరగాల్సిన ఎడిటింగ్ పని గురించి తెలుసుకుందాం.

Blog by Multimedia Faculty – Harshavardhan Reddy