BORN ACTOR ?

Born Actor ?

Born Actor ఆ…. ?

పుట్టుకతోనే నటులవుతారా ? అదెలా సాధ్యం…. ?

NTR, ANR , SVR వీరంతా మహనటులు , వీరిని చాలా మంది Born Actors అంటూ ఉంటారు…!

“సొంతవూరు” అనే చిత్రంలో శ్రీకృష్ణుడు పాత్రని ధరించిన NTR గారు ప్రేక్షకులను మెప్పించలేకపోయారు, కృష్ణుడంటే ఇలా ఉండడు అన్నారు. KV రెడ్డి దర్శకత్వంలో వచ్చిన “మాయాబజార్” చిత్రంలో శ్రీకృష్ణుడు పాత్ర ధరించి , ప్రేక్షకుల గుండెల్లో శ్రీకృష్ణుడు గా చిరస్థాయిగా నిలిచిపోయారు NTR.

మరి BornActor ఎలా అయ్యారు ?

“వరూధిని ప్రవరాఖ్యుడు” చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు SVR గారు, ఆ చిత్రం విజయవంతం కాకపోవడంతో సినిమాలు వదిలేసి , మళ్ళీ తన ఫైర్ మెన్ ఉద్యోగానికి వెళ్లిపోయారు. “పాతాళ భైరవి” చిత్రంతో వెండితెర మీద తన నటనా వెలుగులు నింపారు SVR గారు….

మరి SVR గారు Born Actor ఆ….. ?

నీ కళ్ళు చిన్నవి, కొంచెం తలెత్తి డైలాగ్ చెబితే నీ హావభావాలు ప్రేక్షకులకు కనపడతాయి అని ANR గారికి ఎవరు చెప్పారు…. ?
మరి వీళ్లంతా BORN ACTORS అయితే ఈ మాటలు ఇలా పలకాలి, ఆ expression అలా ఇవ్వాలి అని ఎందుకు చెబుతారు ?
మరి ఈ మహనటులంతా నటన ఎక్కడ నేర్చుకున్నారు…. ఏ ఫిల్మ్ స్కూల్ లో నేర్చుకున్నారు….? ఎవరు నేర్పారు అంటే ? NTR, ANR,SVR లకు నాటకానుభవం ఉంది , వారు ఆ నాటక దర్శకుల దగ్గర కొన్ని మెళకువలు నేర్చుకున్నారు…. సినిమాల విషయానికి వస్తే ఆరోజుల్లో ఉన్న కథా రచయితలు , దర్శకులు…. హెచ్ ఎం రెడ్డి, చక్రపాణి , పింగళి నాగేంద్రరావు , సీనియర్ సముద్రాల , బి ఎన్ రెడ్డి , ఎల్వీ ప్రసాద్ , ఘంటసాల బలరామయ్య , వేదాంతం రాఘవయ్య , కెవి రెడ్డి , ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మార్కస్ బార్ ట్లే ల దగ్గర మెళకువలు తెలిసు కున్నారు….
మరి ఇప్పుడున్న బిజీ బిజీ పరిస్థితుల్లో ఎవరు ఏ రచయిత , ఏ దర్శకుడు నేర్పిస్తున్నారు ?
మరి నటన ఎక్కడ నేర్పిస్తారు…. ?
నటన నేర్చుకోవడానికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి….!

నటన శిక్షణ గురించి ఇంకో పోస్ట్లో తెలుసుకుందాం.

By Acting Professor : Potti Prasad ( FTIH )