ఎడిటర్ కష్టాలు పార్ట్ – 3  లో చెప్పినట్టుగా క్రోమా కీయర్,  ఎడిటింగ్ రఫ్ కట్,  డైలాగ్ కట్ గురించి ఈ రోజు తెలుసుకుందాం.

క్రోమా కీయర్ :

 క్రోమా కట్ చేయడం అంటే ఎడిటింగ్ లో బ్యాక్గ్రౌండ్గ వాడిన  గ్రీన్ లేదా బ్లూ మాట్ రిమూవ్  చేయడమే. ఈ రెండు కలర్స్ మాత్రమే వాడటానికి ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. మన బాడీలో ఈ రెండు కలర్స్ తప్ప మిగిలిన అన్ని కలర్స్ ఉంటాయి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ రిమూవ్  చేసే టైం లో మన బాడీలో ఉన్న డీటెయిల్స్ మిస్ అవ్వకూడదు అని మన బాడీలో లేని గ్రీన్ లేదా బ్లూ కలర్ వాడతాం.  గ్రీన్ మాట్ వాడకం ఎడిటింగ్ లో కంటే విజూవల్ ఎఫెక్ట్స్ లో ఎక్కువగా ఉంటుంది. ఆలా విజూవల్ ఎఫెక్ట్స్ కి వాడే టైం లో ట్రాకింగ్ పాయింట్స్ కూడా గ్రీన్ మాట్ కి ఫిక్స్ చేసి మ్యాచ్ మూవింగ్  లాంటి ప్రకియలో వాడతారు. గ్రాఫిక్స్ లో క్రీయేట్ చేసిన క్యారక్టర్ బ్యాక్గ్రౌండ్ లో అమర్చిన వీడియో తో పటు మూవ్ అవ్వాలి  అంటే ఆ ట్రాకింగ్ పాయింట్స్ చాల అవసరం.  మనం  చూసే న్యూస్ చానెల్స్ కానీ, ఏదైనా యాంకరింగ్    ప్రోగ్రామ్స్ కానీ తరచుగా   గ్రీన్ మాట్ ఇంకా బ్లూ మాట్ వాడతాం.

రఫ్ కట్ :

కొన్ని సీన్స్ షూట్ చేసిన తర్వాత వాటిని స్క్రిప్ట్ ని ఆధారంగా చేసుకొని వరస క్రమం లో పెట్టుకొని వర్క్ ఫ్లో ని చూసుకోవడం కోసం కూడా ఈ రఫ్ కట్ బాగా ఉపయోగ పడుతుంది.ఈ  రఫ్ కట్ చేసే క్రమం లో ఎటువంటి సౌండ్ ఎఫెక్ట్స్ కానీ మ్యూజిక్ కానీ వీడియో కి లింక్ చేయరు.ఎడిటింగ్ ని విభజించిన దశలలో ఇది కూడా ఒకటి.అసిస్టెంట్ ఎడిటర్స్  రఫ్ కట్ చేస్తే సీనియర్ ఎడిటర్ షూట్ నుంచి వచ్చిన ఫుటేజ్ లో ఏమైనా లోపాలు ఉన్నాయేమో గుర్తించే అవకాశం ఉంటుంది.

డైలాగ్ కట్ :

ఈ డైలాగు కట్ సీన్స్ వైస్ గా కట్ చేస్తారు. ఏ చిన్న డైలాగ్ కూడా మిస్ అవకుండా జాగ్రత్త పడాలి. డైలాగ్ టు డైలాగ్ కట్ చేసుకొని DUBBING  కి పంపుతారు. ఈ  డైలాగ్ కట్ కి  కూడా స్క్రిప్ట్ ని ఆధారంగా చేసుకుంటారు. ఇలా చేసి చెక్ చేసుకోవడం వలన ఏమైనా షూట్ చేయాల్సిన పెండింగ్ పాచ్ వర్క్స్ ఉన్నాయో కూడా తెలిసిపోతుంది. రఫ్ కట్, డైలాగ్ కట్స్ తర్వాత ఆ మధ్యలో ఉండాల్సిన షాట్స్ ని, ఫిల్లర్స్ ని  వాడుకొని  ఫైనల్ వీడియో తయారు చేసుకోవడం జరుగుతుంది.

తరువాత పార్ట్ లో  ఎడిటింగ్ లో టైటిల్స్  గురించి తెలుసుకుందాం.

Blog  by Multimedia Faculty – Harshavardhan Reddy