సినిమాకు ఎవరైనా మొదటి ప్రేక్షకుడు ఉన్నాడు అంటే అది ఎడిటర్ మాత్రమే ఎడిటింగ్ కి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కానీ ఎడిటర్ కి మాత్రం ప్రాధాన్యత లేదు అనేది వాస్తవం. సున్నితమైన విషయాలను బలంగా చెప్పాలంటే ఎడిటర్ తన భాద్యతను సమగ్రంగా  నిర్వర్తించాల్సిందే. ప్రతి సినిమాకు సగటున 1300 నుంచి 1600 పైగా కట్స్ ఉంటాయి. అంటే ఎడిటర్ తన పనిని ఎంత ఓపిగ్గా నిర్వర్తించాలో ఆలోచించండి. అంత ఓపికని కూడగట్టుకొని  పని చేయడం ప్రారంభిస్తే అసలు కష్టం అక్కడే ప్రారంభం అవుతుంది. తన బుర్ర బద్దలయ్యే  సమస్యలని  పరిష్కరించాల్సి ఉంటుంది. 1300 కట్స్ లో ఏ ఒక్క కట్ కూడా  సినిమా చూసే ప్రేక్షకుడి దృష్టిని ఇబ్బంది పెట్టకుండా చూపించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటె షూటింగ్ టైంలో  మిస్ అయ్యే ప్రతి కంటిన్యూటీ ఎడిటింగ్ లో కవర్ చేసుకోవాల్సి వస్తుంది. యాక్షన్ కంటిన్యూటీ కావచ్చు, ప్రాపర్టీ కంటిన్యూటీ కావచ్చు, కాస్ట్యూమ్ కంటిన్యూటీ కావొచ్చు. ఏది ఏమైనా  షూటింగ్ సమయం లో రాసె ఎడిటింగ్ రిపోర్ట్ చాల వరకు ఎడిటర్ పనిని, సమయాన్ని  ఆదా చేస్తుంది అని చెప్పడం మాత్రం నిజం.

తనదైన శైలి లో రికార్డు ఐన క్లిప్స్ అన్నిటిని ఒక పజిల్లా సాల్వ్ చేస్తూ సినిమా విజయవంతం కావడం లో కీలక పాత్రపోషిస్తాడు. చూసేవారికి సినిమా ప్లాప్ అయ్యిందని చెప్పడం ఈజీనే. కానీ సినిమా వాడు ప్రతి సినిమాకు ఒకే కష్టం పడతాడు. తాను పని చేసే ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని  కష్టపడతాడు. రంగుల ప్రపంచం అనే లోకంలో ఒక సినిమా ఎడిటర్  ఆ సినిమాకు డెసిషన్ మేకర్ లాంటి వాడు. సినిమా కెప్టెన్  దర్శకుడు కొన్ని సందర్భాల్లో దర్శకుడు సినిమా హిట్ అవ్వాలంటే ఏం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఎడిటర్ ని అడిగిన ఉదాహరణలు ఎన్నో మనం చూస్తుంటాం. రివ్యూ రాసె ప్రతి ఒక్కరికి ఎడిటర్ పడే ఇబ్బందులు తెలుసు కానీ ఎడిటింగ్ ఇంకా షార్ప్ గా ఉండాలి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకా పని చెప్పాల్సిఉంది అని రాయడం కొంచం బాధాకరం. ప్రతి సినిమా  వేడుకలో అందరూ టెక్నిషన్స్  కనిపిస్తారు. కానీ ఎడిటర్ మాత్రం అరుదుగా కనిపిస్తాడు. దానికి కారణం ఎవరి వ్యక్తిగతగంగా వాళ్ళు ఆలోచించాలి. ఎన్ని రకాల ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు  ఉన్నాయి. ఎన్ని రకాల ఎడిటింగ్లు ఉన్నాయి అనేవి తరువాత భాగం లో చూద్దాం.

Blog by Multimedia Faculty – Harshavardhan Reddy.